కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

by  |
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్క్‌ను డెవలప్ చేస్తున్నామని తెలిపిన మంత్రి కేటీఆర్.. ఫార్మాసిటీ, నిమ్జ్‌ను ఫాస్ట్ ట్రాక్ విధానంలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. 2021-22 బడ్జెట్‌లో ప్రాజెక్ట్ వ్యయంలో కనీస సగం మొత్తం కేటాయించాలని కోరారు. ఫార్మాసిటీకి ఇప్పటికే నిమ్జ్ హోదా లభించిందని, పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5.6లక్షలమందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. మౌలిక వసతులకు రూ. 4,922 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్.. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రూ.870 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిమ్జ్‌కు 2016లోనే కేంద్రం నుంచి తుది అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. నేషనల్ డిజైన్‌ సెంటర్‌‌కు కూడా మొదటి విడతగా బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.


Next Story