సెన్సేషనల్ న్యూస్.. కౌన్సిల్ సాక్షిగా తప్పొప్పుకున్న కేటీఆర్

by  |
Minister KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని మణికొండలో రజినీకాంత్ అనే యువకుడు డ్రైనేజీలో పడి మృతి చెందిన ఘటనపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం శాసన మండలిలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. డ్రైనేజీ పనులు జరిగే చోట రెయిలింగ్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం చేశారు. దీనికి మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నానని.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంతేగాకుండా దీనిపై శాఖా పరమైన చర్యల్లో భాగంగా ఏఈ, డీఈలను ఇప్పటికే సస్పెండ్ చేశామని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కూడా జరుపుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. నగరవ్యాప్తంగా డ్రైనేజీ పనులు విపరీతంగా జరుగుతున్నాయి. గుత్తేదారుల, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ నిర్లక్ష్యం వ్యహిస్తున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరగా.. దానికి సానుకూలంగా స్పందిస్తూ.. ఇప్పటికే రూ.5 లక్షలు ఇచ్చామని, త్వరలోనే మరో రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

Next Story

Most Viewed