నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి -కేటీఆర్

18

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‎లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్‌ నీటి విడుదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీలో అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించారని సూచించారు. బస్తీ ఆస్పత్రిల్లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొనాలని తెలిపారు. వాతావరణశాఖతో సమన్వయం చేసుకుంటూ జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ముందుకెళ్లాలని సూచించారు.