ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్లూ పార్టీ పనులు చేయాల్సిందే.. కేటీఆర్ సంచలన ఆదేశాలు

by  |
Minister KTR
X

దిశ, మెదక్: ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు పార్టీ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు పార్టీ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ ద్వారానే ప్రభుత్వ పదవులు వచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రతిఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంచలన ఆదేశాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని, దానిని మరింత పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.

మెదక్ నియోజవర్గంలో ముందునుంచీ టీఆర్ఎస్‌కు మంచి పట్టు ఉందని, దానిని అలాగే కొనసాగించేలా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ప్రతీ గ్రామం నుంచి ప్రజలు రావడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ నేతలతో సమావేశాలు తరచూ నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా పార్టీ స్థానిక నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయని అన్నారు. అనంతరం ఈ నెల 25న జరిగే ప్లీనరీ, నవంబర్ 15న జరిగే విజయ్ గర్జన సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, పల్లె జితేందర్ గౌడ్, పలు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు గంగాధర్, అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, నాగరాజు, మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీలు లావణ్య రెడ్డి, సుజాత, షర్మిల, మాధవి, సంధ్య, విజయ్ కుమార్, ఎంపీపీలు యమున, నారాయణరెడ్డి, చందన, భిక్షపతి, సిద్దిరాములు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్లు కిష్టయ్య, శ్రీహరి, నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సంపత్, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, నాయకులు జగపతి, వెంకట్ రెడ్డి, సాయిరెడ్డి, జగన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed