కేసీఆర్ కోలుకోవాలంటూ మంత్రి పూజలు

by  |
కేసీఆర్ కోలుకోవాలంటూ మంత్రి పూజలు
X

దిశ, సూర్యా పేట: ‘మానవ సమాజంలో మంచిని గ్రహించాలి అన్నదే రామాయణ పరమార్థం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వందలు, వేలు, లక్షల సంవత్సరాల నుండి శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం అంటే మంచి అనే సందేశం ఎప్పటికప్పుడు ఆయా సమాజాలకు చేర వేయడమేనని ఆయన చెప్పారు. హైందవ ధర్మ విలువల ప్రామాణికతకు పెద్ద పీట వేసే హిందువుల పండుగ ఏదన్నా ఉందంటే.. అది శ్రీరామనవమినేనని ఆయన చెప్పుకొచ్చారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మానవ సమాజం కూడా కరోనా పీడ నుండి విముక్తి చెందాలని ఆ భగవంతుడిని ప్రార్దించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మార్కెట్ చైర్మన్ లలిత ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed