జానారెడ్డి నిజస్వరూపం నియోజకవర్గ ప్రజలకు తెలుసు

by  |
Minister Jagadish Reddy
X

దిశ, నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనకవబడటానికి కారణం జానారెడ్డే అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గాన్ని అయిదు దశాబ్దాల కాలం పాలించి, సాగర్ ఎడమ కాలువ కింద 70 వేల ఎకరాలను ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. అందులో 35 ఏండ్లు శాసనసభ్యుడిగా 14 ఏండ్లు మంత్రిగా అధికారం చేలాయించింది జానారెడ్డి కాదా అని ప్రశ్నించారు.

అటువంటి అభ్యర్థికి ఓట్లు వేయాలని ఏ మొహం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజస్వరూపం గమనించిన తర్వాతే నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని తిరస్కరించారని గుర్తుచేశారు. 35 ఏండ్లుగా గుర్తుకు రాని అభివృద్ధి ఎన్నికలప్పుడే గుర్తుకు రావడాన్ని ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నారని, దానిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని, గెలిచేది నోముల భగతే అని ధీమా వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed