జానారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

by  |
Minister Jagadish Reddy
X

దిశ, నాగార్జున సాగర్: నందికొండ మున్సిపాలిటీకి గత 35 ఏండ్లలో జానారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నందికొండ మున్సిపాలిటీలోని ప్రభుత్వ క్వాట్టర్స్‌లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారికి నోముల భగత్ గెలిచిన ఏడాదిలోపే ఇండ్లు కేటాయిస్తామని అన్నారు. తమ సొంత ఇంటి కల నిజం కావాలంటే అది భగత్‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం వల్లే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా చేసిన జానారెడ్డికి నాగార్జునసాగర్‌ అభివృద్ధి ఎన్నడూ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయడానికి జానారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గం వెనుకబడటానికి ముమ్మాటికీ జానారెడ్డే కారణమని ఆయన ఆరోపించారు. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే రాకుండా జానారెడ్డి తోక ముడిచింది నిజం కాదా అని నిలదీశారు. అటువంటి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా నియోజకవర్గానికి ఒరిగేది ఏమి లేదన్నది ప్రజలు గుర్తించారని సూచించారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయె అని గెలిచేది నోముల భగత్ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.



Next Story

Most Viewed