వనదుర్గమాత సేవలో మంత్రి హరీష్ రావు

64

దిశ, వెబ్‎డెస్క్: మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వనదుర్గామాత ఆలయాన్ని శనివారం ఉదయం మంత్రి హరీశ్‌రావు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుమందు ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి హరీశ్‌రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.