32 చెక్ డ్యామ్స్‌కు జలకళ.. రైతులకు హరీష్ రావు స్పెషల్ థ్యాంక్స్

by  |
32 చెక్ డ్యామ్స్‌కు జలకళ.. రైతులకు హరీష్ రావు స్పెషల్ థ్యాంక్స్
X

దిశ, గజ్వేల్ : రైతుల కళ్ళల్లో ఆనందం నింపడానికే ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా మంగళవారం మర్కుక్, వర్గల్ మండలాల్లోని కెనాల్‌లను ఆయన పరిశీలించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంగళవారం 10.30 నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటన ఉంటుందన్నారు. వర్గల్ మండలం అవుసులోని పల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ కాలువలోకి గోదావరి జలాల ను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా 11.15 నిమిషాలకు మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేయనున్నట్లు వివరించారు. దీంతో హల్దీ కాలువలోకి 1600 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందన్నారు. ఈ క్రమంలో 8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాం సాగర్‌లోకి గోదావరి జలాలు మళ్ళించనున్నట్లు తెలిపారు.

హల్దీ, మంజీర నుండి నిజాం సాగర్‌లోకి గోదావరి జలాల విడుదలతో 32 చెక్ డ్యాంలు నిండనున్నాయని తెలిపారు. చెక్ డ్యాంలలో 0.62 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని మంత్రి వెల్లడించారు. గోదావరి జలాలతో వేసవిలో 14 వేల 268 ఎకరాలలోని వరి పంటను కాపాడుకోవచ్చన్నారు. ఈ డ్యాముల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు సహకరించి గోదావరి జలాలు గజ్వేల్‌కు వచ్చేందుకు తోడ్పాటు నందించిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed