కేంద్రం మెడలు వంచాలంటే.. అదే శరణ్యం

by  |
కేంద్రం మెడలు వంచాలంటే.. అదే శరణ్యం
X

దిశ, పటాన్‌చెరు: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ సంస్థ ఉద్యోగులతో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ సంఘటితంగా కేంద్రంపై ఉద్యమించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల అమ్మకాలకు నిరసనగా సీఎం కేసీఆర్‌తో చర్చించి తీర్మానం చేస్తామని అన్నారు.

మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోడీ విదేశాలకు ఆర్డర్లు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ బీహెచ్ఈఎల్ సంస్థలకు రూ.40 వేల కోట్లు, యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌కు రూ.30 వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చారన్నారు. కార్పొరేట్ కంపెనీల కబంధహస్తాల్లో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే కార్పొరేటీకరణ అంగీకరించినట్లేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణలో కేంద్రం మెడలు వంచాలి అంటే ఐక్య ఉద్యమాలే శరణ్యం అన్నారు. నవంబర్ 26 దేశవ్యాప్త సమ్మెకు టీఆర్ఎస్ బేషరతు మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ, చింత ప్రభాకర్, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed