మామను తోబుట్టువులా వర్ణించిన మంత్రి హరీశ్

by  |
మామను తోబుట్టువులా వర్ణించిన మంత్రి హరీశ్
X

దిశ సిద్దిపేట: దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేరిట లక్షా 116 రూపాయలు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట అర్బన్ మండలంలో 112 మందికి రూ.1 కోటి 12 లక్షల 38 వేల 021 రూపాయల కళ్యాణ లక్ష్మీ, 30 మందికి రూ.30.03.480 లక్షల రూపాయల మేర మొత్తం 142 మందికి రూ.1 కోటి 42 లక్షల 41 వేల 501 కోట్ల రూపాయల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తల్లి బరువును దించేలా.. తోబుట్టువులా సీఏం కేసీఆర్ ప్రతి పేదింటి పెళ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదింటి ఆడ పిల్లల పాలిట కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఓ వరమని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నట్లు, బీజేపీ ప్రభుత్వమైన కర్ణాటకలో, కాంగ్రెస్, శివసేన పార్టీ ప్రభుత్వాలైన మహారాష్ట్రలో ఎక్కడ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు లేవని చెప్పారు.సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తూ, సిటీ స్కాన్, ఐసీయూ, డయాలసిస్, డయాగ్నోస్టిక్ కేంద్రాలతో పాటు కోవిడ్ ఐసోలేషన్, బ్లాక్ ఫంగస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రయివేటు దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు, సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషేంట్ బంధువుల కోసం వెయిటింగ్ హాల్ అందుబాటులో తెచ్చి, వేడి వేడి ఆహారం పెడుతున్నట్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో లభించే వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. ఆడ బిడ్డలకు ఓపికతో నార్మల్ డెలివరీలు చేయించాలని, నార్మల్ డెలివరీ ఆవశ్యకతపై తల్లులకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి

కరోనా అంటే భయం.. నిర్లక్ష్యం రెండూ వద్దని.. జాగ్రత్త వహించాలని, రెండు దఫాలుగా తానూ కొవిడ్ టీకా తీసుకున్నానని., కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా టీకాను 18 సంవత్సరాలు పైబడిన వారందరూ తీసుకోవాలని కోరారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని, ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీశ్ కోరారు. కరోనా టీకా వేయించుకున్నవారు నిర్లక్ష్యం వహించవద్దని సూచిస్తూ.., ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, పౌరులు విధిగా తమ బాధ్యతగా తమ ప్రాంతంలోని ప్రజలందరూ కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేయించుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కోరారు.

Next Story

Most Viewed