ఇంటింటా కలియ తిరిగిన హరీశ్‌రావు

by  |
ఇంటింటా కలియ తిరిగిన హరీశ్‌రావు
X

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో ఆదివారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఇంటింటా కలియ తిరిగారు. డ్రై డేలో భాగంగా ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఇంటి కుటుంబీకులకు చూపించారు. ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు విధిగా మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రజలకు సూచించారు. డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డెంగ్యూ, చికెన్‌ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటనీ పలువురు గృహిణులను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని పట్టణ గృహిణులకు మంత్రి సూచించారు.



Next Story

Most Viewed