రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను అభినదించిన మంత్రి హరీష్ రావు

by  |
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను అభినదించిన మంత్రి హరీష్ రావు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలోనే వాక్సినేషన్ మొదటి డోస్ 104% పూర్తి చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టరును, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, వైద్య సిబ్బందిని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి
టి. హరీష్ రావు అభినందించారు. రంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఇతర జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రతి గ్రామాన్ని వంద శాతం వాక్సినేషన్ గ్రామంగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టరులు, వైద్య ఆరోగ్య అధికారులు, పంచాయతీ అధికారులతో వాక్సినేషన్ పై రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య మంత్రి టి. హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రజల్లో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకాన్ని పెంచేందుకు సీఎం కెసీఆర్ రూ.10 వేల కోట్లు ఆరోగ్యం కొరకు కేటాయించినట్లు తెలియజేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు చేరే విధంగా వైద్యాధికారులు శాంపిల్స్ లక్ష్యాలను పెంచాలన్నారు. హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని సర్జరీలు చేపట్టాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోస్ వంద శాతం పూర్తి చేయుటకు చేపట్టిన విదంగానే ఇతర కార్యక్రమాలు చేపట్టి రెండు వారాలలో పూర్తి చేస్తామని, తమరి సూచనల ప్రకారం ఆసుపత్రులను తనిఖీ చేసి అన్ని విధాలుగా ప్రజలకు వైద్యం అందిచేందుకు, అన్ని విభాగాల సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు చేపడతామని మంత్రికి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed