యాక్టింగ్‌లో బీజేపీకి ఆస్కార్ ఇవ్వొచ్చు : హరీష్‌రావు

by  |
యాక్టింగ్‌లో బీజేపీకి ఆస్కార్ ఇవ్వొచ్చు : హరీష్‌రావు
X

దిశప్రతినిధి, మెదక్ : దుబ్బాక ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలనుకుంటున్న బీజేపీ తన స్థాయిని తగ్గించుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజక వర్గం తొగుటలో టీఆర్ఎస్ యువ గర్జనలో భారీ బైకు ర్యాలీ తీశారు. దుబ్బాక రెడ్డి సంక్షేమ భవన్‌లో టీఆర్ఎస్‌కు మద్దతుగా టీఎస్ ఎమ్మార్పీఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 9న ఆనాడు వచ్చిన తెలంగాణ ఎక్కడ పోతుందోనని అందరం రాజీనామాలు చేశామని, కానీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలని చెప్పారని, మరీ ఈ ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా అని ప్రశ్నించారు. మార్కెట్లను రద్దు చేసి రైతులను నష్టాల్లోకి నెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ముత్యం రెడ్డి మంచి నాయకుడని కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు. గల్లీలో లేదంటూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెబుతూ దుబ్బాక ప్రజలను బీజేపీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ఆ పార్టీ మోసపూరిత మాటలకు నియోజకవర్గ ప్రజలు మోసపోవద్దని సూచించారు.

బీజేపీకి యాక్టింగ్‌లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని, మిరుదొడ్డిలో బీజేపీకి చెందిన కార్యకర్త చనిపోతే పరామర్శకు కూడా చేసిందేమీ లేదని, ఇక ముందు కూడా చేసేదేమి లేదని విమర్శించారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే లక్ష మెజార్టీ పక్కా అని స్పష్టమవుతోందని మంత్రి వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed