పింఛన్లపై చర్చకు సిద్దమా…

by  |
పింఛన్లపై చర్చకు సిద్దమా…
X

దిశ ప్రతినిధి, మెదక్:
తెలంగాణలో ఇస్తున్న పింఛన్ల విషయంలో కేంద్రం ఎన్ని డబ్బులను ఇస్తున్నదో చర్చకు బీజేపీ సిద్దమా… అంటూ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయ్‌పోల్ మండలానికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాల్ లక్ష్మీ , దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేశ్ 200 మందితో మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పింఛన్‌ను రెండు వందల నుండి 2వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్, టీ‌ఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

కేంద్రం నుండి ఇచ్చేది ఎంతో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి పింఛన్లకు తెలంగాణ ప్రభుత్వం 11వేల 7వందల 20 కోట్లు ఇస్తోందనీ, ఢిల్లీ నుండి వచ్చేది 210 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పప్పులో చిటికెడు ఉప్పు వేసి పప్పు మొత్తం నేనే చేశా అన్నట్టుగా బీజేపీ నాయకుల కథ ఉందన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను గెలిపించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. మొత్తం డబ్బులు కేంద్రమే ఇస్తోందని బీజేపీ ప్రచారం చేస్తూ ఓట్లను అడగడం సిగ్గుచేటన్నారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని తెచ్చి రైతులను ఇబ్బందులు పెట్టాలని బీజేపీ చూస్తోందని తెలిపారు. నిన్ననిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల డిపాజిట్ గల్లంతు అయ్యిందన్నారు. రేపు దుబ్బాకలో అదే జరగబోతోందన్నారు.


Next Story

Most Viewed