‘థర్డ్ వేవ్ వస్తుంది.. పిల్లలకు ఈ ఫుడ్ తినిపించండి’

by  |
‘థర్డ్ వేవ్ వస్తుంది.. పిల్లలకు ఈ ఫుడ్ తినిపించండి’
X

దిశ సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని 3 నుంచి 6 సంవత్సరాల వయస్సున్న చిన్నారులకు ఉచిత ప్రోటీన్ ఫుడ్ అందించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేట పట్టణం ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద చిన్నారులకు ఉచితంగా ప్రోటీన్ ఫుడ్ అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించిoచారు. ఈ కార్యక్రమంలో భాగంగా 200 మంది చిన్నారులకు ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించి వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలన్న ఆశయంతో సత్య సాయి సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. త్వరలో థర్డ్ వేవ్ వస్తుందని, చిన్నారులకు ప్రమాదం అన్న వార్తలు కూడా వస్తున్నాయని మంత్రి గుర్తుచేశారు. అందుకే ఏ వేవ్ వచ్చినా చిన్నారులు‌ తట్టుకునేలా బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed