చింతమడక.. అభివృద్ధిని వేగవంతం చేయాలి

by  |
చింతమడక.. అభివృద్ధిని వేగవంతం చేయాలి
X

దిశ, మెదక్: చింతమడకలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, దసరా కల్లా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో చింతమడక, అంకంపేట, దమ్మచెరువు, సీతారాంపల్లెల అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. చింతమడక గ్రామంలో ఇండ్ల నిర్మాణ ప్రగతి ఆశించిన వేగంగా జరగకపోవడంపై ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రాయింగ్‌లు పూర్తైనా నిర్మాణ పనులు ఆలస్యం కావడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మ్యాప్స్, లెవెల్స్, లే అవుట్ 3 రోజుల్లో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చింతమడకలో డంపింగ్ యార్డు పనులు వచ్చే 15 రోజుల్లో, స్మశాన వాటిక పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ పద్మాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed