పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో మంత్రి గంగుల వాగ్వాదం (వీడియో)

by  |
పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో మంత్రి గంగుల వాగ్వాదం (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. క్యాంపుల నుంచి వచ్చిన ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తుండటంతో కొన్ని చోట్ల ఓటర్లు లేక పోలింగ్ స్టేషన్‌లు బోసిపోయాయి. ఈ క్రమంలో లీడర్లు తమ ఓటర్లందరినీ ఒక్కసారిగా తీసుకొస్తున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో పోలీసులకు, మంత్రి గంగుల కమలాకర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓటర్లతో జడ్పీ పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన గంగుల.. బూత్‌లోకి ప్రవేశించే క్రమంలో పోలీసులు అడ్డగించారు.

ఓటర్లు, లీడర్లు అందరూ గులాబీ రంగు కలిగిన కండువాలతో రావడంతో పోలీసులు అడ్డగించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన గంగుల.. కండువాలపై ఎలాంటి గుర్తులేదని చెప్పగా.. కండువా రంగు టీఆర్ఎస్ పార్టీ కలర్ అని, అందుకే అనుమతించమని పోలీసులు చెబుతున్నా.. అది వినిపించుకోకుండా గంగులతో పాటు కొందరు నాయకులు పోలింగ్ బూత్‌లోకి వెళ్లిపోయారు. కరోనా వేళ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ.. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఇతర టీఆర్ఎస్ నేతలు మాస్కులు ధరించకుండా గుంపులుగుంపులుగా పోలింగ్ బూత్‌‌కి రావడం గమనార్హం.

Next Story

Most Viewed