వారందరికీ వ్యాక్సిన్: మంత్రి గంగుల

by  |
వారందరికీ వ్యాక్సిన్: మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ సిటీ: ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న వారందరికీ వ్యాక్సినేషన్ చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎల్పిజి , పెట్రోల్ పంపు , చౌక ధరల దుకాణాల డీలర్లకు, వర్కర్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి రోజూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అత్యవసర సేవలు అందించే చౌక ధరల దుకాణాల డీలర్లు , పెట్రోల్ బంకులు డీలర్లు , ఎల్పీజీ గ్యాస్ డీలర్లు పనిచేసే వర్కర్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో మొత్తం 83,600 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి రోజు ప్రజల మధ్యలో ఉండే వీరికి వ్యాక్సిన్ చేయాలని కోరిన వెంటనే ఆమోదించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో 794 ఎల్పిజి డీలర్ లు , 3,229 పెట్రోల్ పంపు డీలర్లు ఉన్నారని, మొత్తం 49,616 మందిని వ్యాక్సినేషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, రాష్ట్రంలో 17వేల చౌక ధరల దుకాణాల ఉండగా..ఒక్కొక్క చౌక ధరల దుకాణానికి ఇద్దరు చొప్పున మొత్తం 33,000 మందిని వ్యాక్సినేషన్ కు అర్హులుగా గుర్తించామని మంత్రి తెలిపారు . పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ మూడు విభాగాలలో గుర్తించిన మొత్తం 83,600 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలను 33 వేల మందిని వ్యవసాయ శాఖ ద్వారా గుర్తించి వారందరికీ కూడా శుక్ర ,శని వారాలలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా టీకా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కూడా ఇంతవరకు దాదాపు 65 -70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సీజన్లో 85% దాన్యం కొనుగోలు పూర్తి చేశామని ,మిగిలిన ధాన్యాన్ని వచ్చే 10 -12 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె .శశాంక నగరపాలక సంస్థ మేయర్ వై. సునీల్ రావు , కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి , సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed