మంత్రి సొంత నిధుల‌తో రైతు వేదిక

by  |
మంత్రి సొంత నిధుల‌తో రైతు వేదిక
X

దిశ, ఖ‌మ్మం: ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో స్థానికమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత నిధులు రూ.40 లక్షలతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న అధునాతన, సువిశాలమైన, మోడల్ రైతుబంధు వేదిక నిర్మాణ పనులను మంత్రి బుధ‌వారం ప్రారంభించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేదిక రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, ఏఎంసీ చైర్మన్ వెంకటరమణ, త‌దిత‌రులు ఉన్నారు.

Next Story

Most Viewed