కోహ్లీపై మైకేల్ వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

by  |
కోహ్లీపై మైకేల్ వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆటగాళ్లంటేనే ఒంటికాలిపై లేచే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైఖేల్ వాన్ మరోసారి విమర్శలు గుప్పించాడు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఇద్దరూ సమానమే.. కాకపోతే కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లెక్కలో కొద్దిగా ఎక్కువ అంటే వ్యంగ్యంగా విమర్శించాడు. ఒక వేళ కేన్ విలియమ్‌సన్ ఇండియాలో పుట్టి ఉంటే భారీ వాణిజ్య ఒప్పందాలతో భారీగా డబ్బులు సంపాదించేవాడని అన్నాడు. మైదానంలో అనుభవం, నిలకడ పరంగా చూస్తే కేన్ మంచి బ్యాట్స్‌మాన్ అని మైఖేల్ అన్నాడు. కేన్ ప్రపంచంలో అత్యుత్తమమైన ఆటగాడు అని నేను అంటే భారతీయులు ఒప్పుకోరు. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు ఒప్పుకోరుగా అంటూ విమర్శలు చేశాడు. కాగా, జూన్ 18 నుంచి ఇండియా-న్యూజీలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, కేన్ కీలకంగా మారనున్నారు.

Next Story

Most Viewed