బీజేపీలోకి ‘మెట్రోమ్యాన్’.. ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే!

118

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై సమాలోచనలు జరపుతున్నారు.అధికార పార్టీ LDF నుంచి ప్రతిపక్ష పార్టీ UDF లోనికి వలసలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

ఇదిలాఉండగా, దేశంలో ‘మెట్రో మ్యాన్’గా ప్రసిద్ది చెందిన ఇ శ్రీధరన్ గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. అభివృద్ధి అజెండా ఆధారంగా రాజకీయాల కోసం ఎదురుచూస్తున్న కేరళకు ఇది గొప్ప రోజు అని కేరళ కాషాయ దళం హ్యాండిల్ ట్వీట్ చేసింది. అంతకుముందు, కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని శ్రీధరన్ చెప్పుకొచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..