99 శాతం పెరిగిన మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు

by  |
Benz-cars
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా అమ్మకాల వృద్ధిని సాధించింది. మొత్తం 4,101 వాహనాలను విక్రయించడం ద్వారా వార్షిక పరంగా 99 శాతం బలమైన త్రైమాసిక గణాంకాలను బుధవారం ప్రకటించింది. సమీక్షించిన కాలంలో రిటైల్ అమ్మకాల పెరుగుదల, కొవిడ్ ప్రభావం తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా కొనసాగుతుండటం వంటి సానుకూల పరిణామాల కారణంగానే వినియోగదారుల ఆదరణ పెరిగిందని, దీంతో అత్యధిక అమ్మకాలను సాధించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య మొత్తం 8, 958 యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసినట్టు పేర్కొంది. భారత్‌లో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడటం, కంపెనీ నుంచి కొత్త మోడళ్లకు పెరిగిన ఆదరణ వల్ల ఇది సాధ్యమైందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ అన్నారు. ఈ ఏదాదిలో కంపెనీ నుంచి వచ్చిన ఎల్‌డబ్ల్యూబీ ఈ-క్లాస్ మోడల్ అత్యధికంగా అమ్ముడైందని, దీని తర్వాత జీఎల్‌సీ లగ్జరీ ఎస్‌యూవీ మోడల్ ఎక్కువ అమ్మకాలను సాధించింది. అంతేకాకుండా ఈ ఏడాది గతం కంటే ఎక్కువగా ఆన్‌లైన్ అమ్మకాలు జరిగాయని కంపెనీ పేర్కొంది.



Next Story

Most Viewed