ఇటలీలో లాక్‌డౌన్‌ గురించి మానసిక పరీక్షలు

by  |
ఇటలీలో లాక్‌డౌన్‌ గురించి మానసిక పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటాలియన్లు ఎంతకాలం పాటు లాక్‌డౌన్‌లో ఉండగలరనే విషయం తెలుసుకోవడానికి మానసిక పరీక్షలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు ఇటలీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కరోనా మహమ్మారి దారుణానికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి. రానున్న వారంలో లాక్‌డౌన్ గురించి ప్రధాని జెసెప్పే కొంటే సూచనలు జారీ చేయనున్నారు. వాటిలో ఈ మానసిక పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా ఆదేశాలు ఉండొచ్చు.

దీర్ఘకాలిక లాక్‌డౌన్ కారణంగా గృహహింసలు, సమస్యలు పెరగడం, ఇంట్లో ఆహార వసతి, సామాగ్రి తగ్గడం, గృహిణులకు పెరుగుతున్న పనిభారం, వయోవృద్ధుల్లో భయాందోళనలు, అభద్రతాభావం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ కలిసి ఇటాలియన్ల మానసిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కరోనా వైరస్ ఉధ‌ృతి తగ్గకపోవడంతో లాక్‌డౌన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అక్కడి ప్రభుత్వానికి అర్థం కాట్లేదు. ఈ నేపథ్యంలో ప్రజల మానసిక పరిస్థితిని పరీక్షించి, వారు ఇంకా ఎంతకాలం లాక్‌డౌన్ భరించగలరోనన్న విషయం మీద స్పష్టత కోసం ఈ పరీక్షల నిర్వహించకతప్పదని అక్కడి శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచించారు.

Tags – corona, covid, lockdown, Italy, Mental

Next Story

Most Viewed