కేంద్ర మంత్రి, ఐవోఏ అధ్యక్షుడి మధ్య గొడవ

by  |
కేంద్ర మంత్రి, ఐవోఏ అధ్యక్షుడి మధ్య గొడవ
X

దిశ, స్పోర్ట్స్: కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్ర మధ్య గొడవ జరిగింది. టోక్యో ఒలింపిక్స్ సన్నాహకాలకు సంబంధించి జరిగిన ఒక అత్యున్నత సమావేశంలో ఈ ఘటన జరిగినట్లు ది ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా పలు అర్హత టోర్నీల్లో భారత అథ్లెట్లు పాల్గొనలేక పోయారని.. దీని వల్ల ఆటగాళ్లకు తీవ్రమైన నష్టం కలిగిందని మంత్రి కిరణ్ రిజిజు సమావేశంలో ప్రస్తావించారు. ఐవోఏ సరైన సమయంలో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, ఇతర క్రీడా సమాఖ్యలతో కోఆర్డినేషన్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా మధ్యలో కల్పించుకొని తాము అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతోపాటు క్రీడా సమాఖ్యలతో టచ్‌లో ఉన్నామని చెబుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. దీంతో మంత్రి రిజిజు ‘తాను ఎవరో తన పదవి ఏంటో తెలుసుకొని మాట్లాడండి’ అంటూ నరీందర్ బాత్రపై మండిపడ్డారు. అంతే కాకుండా సమావేశం మధ్యలోనే మంత్రి రిజిజు వెళ్లిపోయారు.



Next Story

Most Viewed