వైద్య బృందాలచే అంద‌రికీ ఆరోగ్య ప‌రీక్ష‌లు

by  |
వైద్య బృందాలచే అంద‌రికీ ఆరోగ్య ప‌రీక్ష‌లు
X

దిశ, న్యూస్ బ్యూరో: క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఓ వైపు లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. న‌గ‌రంలో వైర‌స్ వ్యాప్తిని పూర్తిగా అరిక‌ట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టి పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్ల పద్ధతిని అమ‌లు చేస్తోంది. క‌రోనా వైర‌స్ ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తుల ద్వారా ఇత‌రుల‌కు సోకడంతో పాటు ఆ వ్యాధి సోకిన‌వారికి తెలియ‌కుండానే ఇత‌రుల‌కు వ్యాప్తి చెందుతోంది. దీంతో బాధితుల‌కే కాక వారి కుటుంబ స‌భ్యులకు, వారిని క‌లుసుకున్న వ్య‌క్తుల‌కు, కంటైన్‌మెంట్ జోన్ల‌లో ఉన్న‌కుటుంబాల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆశ్ర‌యం క‌ల్పించిన 4,565 మందికి కూడా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

అనాథ‌లు, వివిధ ప‌నుల నిమిత్తం న‌గ‌రానికి వ‌చ్చి లాక్‌డౌన్ నేప‌థ్యంలో చిక్కుకుపోయిన 228 మందికి 12 షెల్ట‌ర్‌ హోమ్స్‌లో ఆశ్ర‌యం ఇచ్చి భోజ‌న వ‌స‌తి, స‌దుపాయాల‌ను క‌ల్పించింది. ఇవేకాక 13 తాత్కాలిక షెల్ట‌ర్లు నెల‌కొల్పి 1157 మందికి, న‌గ‌రంలో ప‌నిచేస్తున్న (85) స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో చిన్న చిన్న క‌మ్యునిటీ హాళ్లు, వ‌స‌తి గృహాల్లోనూ 3,180 మందికి ఆశ్ర‌యం క‌ల్పించారు. మొత్తం 120 ప్రాంతాల్లో ఆశ్ర‌యం కల్పించిన 4565 మందికి రెండు పూట‌ల భోజ‌నంతో పాటు శానిటైజ‌ర్లు, స‌బ్బులు, మాస్కులు అందిస్తున్నారు. దాత‌ల స‌హ‌కారంతో కొన్ని షెల్ట‌ర్ల‌లో దుప్ప‌ట్లు, వ‌స్త్రాల‌ను పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వీరందరికీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. జ్వ‌ర‌ పీడిత‌ుల‌ను అంబులెన్స్‌ల ద్వారా ప్ర‌భుత్వ ఆస్పత్రుల‌కు త‌ర‌లించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags : Continement Zones, GHMC, Lock down, Shelter homes, Corona test

Next Story