కరోనాను తరిమికొట్టడానికి అదొక్కటే మార్గం

by  |

దిశ, శంకర్‌పల్లి: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మాసానిగూడ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రాములు కోరారు. సోమవారం మాసానిగూడ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి, టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి రాములు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. టీకాలు వేయించుకునేందుకు వచ్చే వారందరూ మాస్కులు ధరించి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుగుణ, కార్యదర్శి శేఖర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story