అర్ధరాత్రి గుండెపోటు.. 9 ఆస్పత్రులు తిరిగినా…

by  |

దిశ ప్రతినిధి, హైదరాబాద్: బుధవారం అర్థరాత్రి 37ఏళ్ల వ్యక్తికి గుండెపోటు. వెంటనే స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బెడ్‌లు లేవు పెషెంట్‌ను చేర్చుకోమని సిబ్బంది తేల్చి చెప్పారు. వెంటనే మరో పేరు మోసిన ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడా అదే సమాధానం. అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆస్పత్రి.. అక్కడ కూడా సీన్ రిపీట్. ఇలా 9ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్‌ దొరకలేదు, వైద్యం అందలేదు. దీంతో సకాలంలో వైద్యసేవలు అందక ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గండిపేట హైదర్‌షా‌కోట్ ప్రాంతానికి చెందిన డి. గోవింద్‌ (37)అనే వ్యక్తికి బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మెహిదిపట్నంలోని ప్రీమియర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మంచాలు లేవు.. వైద్యం అందించలేమని చెప్పడంతో, వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా బెడ్‌లు లేవని చెప్పడంతో ఈఎస్ఐ, గ్లోబల్‌ ఆస్పత్రులతో పాటు మరికొన్ని ప్రైవేట్ ఆస్ప్రత్రులకు తీసుకెళ్లారు. అక్కడా బెడ్‌లు లేవని చెప్పడంతో.. చివరికి బంజారాహిల్స్‌లోని విరంచి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇదే క్రమంలో కుటుంబ సభ్యులు వైద్యులతో మాట్లాడుతుండగానే గోవింద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇన్ని ఆస్పత్రులు తిరిగినా వైద్యం అందక చనిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి 18నెలల క్రితం వివాహం కాగా నెలల కూతురు ఉంది.



Next Story

Most Viewed