కరోనాపై పోరులో ఎంబీబీఎస్ విద్యార్థులు

by  |
కరోనాపై పోరులో ఎంబీబీఎస్ విద్యార్థులు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్ట్ స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా సేవలందించడం వైద్యులకు సవాలుగా మారుతోంది. ఈ క్రమంలో కరోనాపై పోరులో ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకునే విషయాన్ని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నిపుణులతో ఆదివారం ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో మానవ వనరుల పరిస్థితి ఎలా ఉంది.. వాటిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై నిపుణులతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు కొవిడ్‌పై పోరులో మరింత పటిష్టంగా పోరాడేందుకు మానవ వనరులను గణనీయంగా పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికోసం ఎంబీబీఎస్, నర్సింగ్ ఉత్తీర్ణులతో పాటు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల సేవలను వినియోగించు కోవాలని నిర్ణయించినట్టు చెప్పాయి. కొవిడ్ విధులు నిర్వర్తించనున్న క్రమంలో వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్రం తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి



Next Story

Most Viewed