బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

by  |
bangladesh news
X

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో కనీసం 52 మంది మరణించగా, మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం వెలువడ్డ స్థానిక మీడియా కథనాల ప్రకారం, నారాయణ్ గంజ్‌లోని ఆరు అంతస్తుల షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భవనంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించి తర్వాత పై అంతస్తు వరకు చేరినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కెమికల్స్, ప్లాస్టిక్ బాటిళ్ల నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని చెబుతున్నారు. ఈ మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు పై అంతస్తుల నుంచి దూకేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గల్లంతైన తమ ఆప్తుల కోసం ఎదరుచూస్తూ భవనం ఎదుట బంధువుల తాకిడి పెరిగింది. భవనంలో మంటలు చెలరేగినప్పుడు ఏకైక గేటుకు తాళం వేసి ఉన్నదని, బిల్డింగ్‌లో సరైన అగ్నిమాపక పరికరాలు లేవని బంధువులు, రక్షణ సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని అధికారులు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed