కొవిడ్ కట్టడికి ఏ మాస్క్ బెటరో తెలుసా?

by  |
కొవిడ్ కట్టడికి ఏ మాస్క్ బెటరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారిని నిరోధించాలని దాదాపు అన్ని దేశాలు.. దానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నాయి. చాలా దేశాలు..ట్రయల్స్ కూడా పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా కొవిడ్ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ, అది ఒక సంవత్సరం వరకు మాత్రమే పనిచేస్తుందని చెబుతోంది. అయితే, రాబోయే వ్యాక్సిన్‌ల పని తీరు కూడా ఇప్పుడే ఏం చెప్పలేం. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా మరికొన్ని నెలల పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందర్నీ కాపాడే ఆయుధాలు..మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్.

ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు..కిరాణ షాపు నుంచి మెడికల్స్.. పెద్ద పెద్ద మాల్స్ వరకు అంతటా.. ఎన్నో రకాల మాస్క్‌లు దర్శనమిస్తాయి. మరి ఆ మాస్కుల్లో.. ఏదీ బెస్ట్. ఏదీ కరోనాను ఆపుతుంది? ఏ మాస్క్ పెట్టుకోకపోవడం ఉత్తమం? అన్ని రకాల మాస్క్‌లు వైరస్‌ను కట్టడి చేస్తాయా? శాస్త్రవేత్తలు మాస్క్‌లపై ఏమంటున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు మాస్క్ మస్ట్ అయిపోయింది. సర్జికల్ మాస్క్‌లు, ఎన్-95 మాస్క్‌లు, మ్యాచింగ్ మాస్క్‌లు వాటి జాబితా పెద్దదే అయినా.. మొత్తంగా 14 రకాల మాస్క్‌లపై అమెరికా, నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఎలాంటి మాస్క్ ధరిస్తే.. కరోనాను అడ్డుకోవచ్చనే దానిపై స్టడీ చేశారు. లేజర్ సెన్సర్ డివైజ్‌తో 14 రకాల మాస్క్‌లను, ఫేస్ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. ఏ మాస్క్ ధరించిన సమయంలో డ్రాప్‌లెట్స్ ఎలా అడ్డుకుంటున్నాయో నిశితంగా గమనించారు. ఈ 14లో ఒకరకం (నెక్ గెటర్) మాస్క్ అయితే, కరోనా వ్యాప్తికి సహకరించే నోటి తుంపర్లను అడ్డుకోకపోగా.. వాటిని ధరించడం వల్ల రిస్క్ ఓ పదిశాతం ఎక్కువ చేస్తోందని గుర్తించారు. అంటే ఆ మాస్కు వేసుకోవడంకన్నా అసలు మాస్కు లేకుండా ఉండటమే కాస్త తక్కువ రిస్క్ అన్నమాట.

వైరస్‌ను (డ్రాప్‌లెట్స్) నిరోధించడంలో ఎన్ – 95 మాస్క్‌లు ఉత్తమమని తేల్చారు . కానీ, ఎన్ -95 మాస్క్‌లో వాల్వ్ లేనివి వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ మాస్క్‌తో పాటు..త్రీ లేయర్ మాస్క్, కాటన్ పొలిప్రోలిన్ కాటన్ మాస్క్, టూ లేయర్ పొలిప్రోలిన్ అప్రాన్ మాస్క్‌లు మంచివని చెబుతున్నారు. ఇటీవలే జరిగిన ఓ పరిశోధనలో వాల్వ్‌లున్న ఎన్ –95 మాస్క్‌లు తుంపర్లను అడ్డుకోవడంలో విఫమవుతున్నాయని వెల్లడైన విషయం అందరికీ తెలిసిందే. మాస్క్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఉత్తమమైన మాస్క్‌లు ఒకటి నుంచి 14 వరకు ..

1. Fitted N95, no valve (14 in photo)
2. 3-layer surgical mask (1)
3. Cotton-polypropylene-cotton mask (5)
4. 2-layer polypropylene apron mask (4)
5. 2-layer cotton, pleated style mask (13)
6. 2-layer cotton, pleated style mask (7)
7. Valved N95 mask (2)
8. 2-layer cotton, Olson style mask (8)
9. 1-layer Maxima AT mask (6)
10. 1-layer cotton, pleated style mask (10)
11. 2-layer cotton, pleated style mask (9)
12. Knitted mask (3)
13. Double-layer bandana (12)
14. Gaiter-style neck fleece (11)

Next Story