మారుతీ సుజుకి నెక్సా విజయం.. ఆరేళ్లలో ఎన్ని అమ్మకాలంటే ?

by  |
మారుతీ సుజుకి నెక్సా విజయం.. ఆరేళ్లలో ఎన్ని అమ్మకాలంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తమ ప్రీమియం సేల్స్ నెట్‌వర్క్ విభాగం నెక్సా భారతీయ మార్కెట్లో ఆరెళ్లను పూర్తి చేసినట్టు వెల్లడించింది. ఈ కాలంలో నెక్సా ప్రీమియం విభాగంలో మొత్తం 14 లక్షల కార్ల అమ్మకాల మైలురాయిని దాటినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2015లో నెక్సా విభాగాన్ని ప్రారంభించిన సందర్భంలో కంపెనీ కొత్త తరం, యుత వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో ప్రారంభించామని, ప్రస్తుతం తమ వినియోగదారుల్లో దాదాపు సగం మంది కస్టమర్లు 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన వారని కంపెనీ ప్రకటించింది.

ముఖ్యంగా నెక్సా విభాగం మొదటిసారి కార్లను కొనేవారిని ఆకర్షించగలిగిందని, వీరు మొత్తం అమ్మకాల్లో దాదాపు 70 శాతం వరకు ఉన్నారని కంపెనీ వివరించింది. ఇప్పటివరకు మారుతీ సుజుకి మొత్తం 234 నగరాల్లో 380 నెక్సా ఔట్‌లెట్లను కలిగి ఉంది. ‘ కొత్త ఆవిష్కరణలతో కొనసాగుతున్న నెక్సా విభాగం కార్ల అమ్మకాల కంటే కార్ల కొనుగోలులో కొత్త అనుభవాన్ని వినియోగదారులకు ఇవ్వడానికి ఉద్దేశించిందని’ మారుతీ సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. నెస్కా ప్రీమియం కార్ల విభాగంలో ఇగ్నిస్, బలెనో, సియజ్, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్ 6 మోడల్లను మారుతీ సుజుకి విక్రయిస్తోంది. అలాగే, అరెనా ఔట్‌లెట్లలో ఆల్టోతో పాటు విటారా బ్రెజా మోడళ్లను విక్రయిస్తోంది.



Next Story

Most Viewed