సర్పంచ్‌ను చంపిన మావోలు.. బీజేపీ నాయకుడికి హెచ్చరికలు

51

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం రాత్రి దబ్బ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త అయిన మనురామ్ సలామ్‌ని హత్య చేశారు. మోహ్లా మన్‌పూర్‌లోని సలామ్ ఇంటివద్దకు అర్ధరాత్రి వచ్చిన సాయుధ మావోయిస్టులు అతడిని ఇంట్లో నుంచి లాక్కుపోయారు. అనంతరం ఊరి శివారులో గొంతుకోసి.. మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్న కారణంగా హత్య చేసినట్లు మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖ వదిలారు. అంతేకాకుండా సర్పంచ్‌ ఇంటి వద్ద ధాన్యంలోడుతో ఉన్న ట్రాక్టర్‌‌కి నిప్పుపెట్టి కాల్చివేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక బీజేపీ నాయకుడు రాజు తాండియాకి కూడా హెచ్చరికలు చేశారు.‌

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..