మావోయిస్టు భాస్కర్.. ఎక్కడ్నుంచి వచ్చాడంటే !

by  |
మావోయిస్టు భాస్కర్.. ఎక్కడ్నుంచి వచ్చాడంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారం ఆడెల్లు అలియాస్ భాస్కర్.. పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. విద్యార్థి దశలో ఆర్ఎస్‌యూలో పనిచేసి ఆయన నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం భాస్కర్ దళాన్ని పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. చిక్కినట్టే చిక్కి తప్పించుకు తిరుగుతున్న భాస్కర్.. ప్రస్తుతం పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇంతకీ ఎవరీ భాస్కర్.. ఎక్కడి నుంచి వచ్చాడంటే…

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో జన్మించిన భాస్కర్.. బోథ్‌లోనే పదోతరగతి వరకు చదువుకున్నారు. నిర్మల్‌లో ఇంటర్మీడియట్ చదవుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇదే క్రమంలో నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితులై బోథ్ దళ సభ్యుడిగా చేరారు. అక్కడి నుంచి ఇంద్రవెళ్లి దళం డిప్యూటీ కమాండర్‌గా ఎదిగిన ఆయన కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోకి వెళ్లారు. 1989లో భూ పోరాటాలు విస్తృతంగా జరుగుతున్న సమయంలో ఉద్యమాల్లో పాల్గొన్న భాస్కర్.. 1994లో దళంలోకి వెళ్లారు.

పోలీసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్న భాస్కర్‌ సవాల్‌గా మారాడు. భాస్కర్ ఆధ్వర్యంలో యాక్షన్ టీమ్ రిక్రూట్ మెంట్ పెరిగితే మళ్లీ మొదటికి వస్తుందని భావించిన పోలీసులు అణచివేత దిశగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.


Next Story