ఆర్నాల్డ్‌కు అభిమాని అపూర్వ కానుక!

by  |
ఆర్నాల్డ్‌కు అభిమాని అపూర్వ కానుక!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఒకప్పుడు.. సెలెబ్రిటీలను చూడటమే గగనంగా ఉండేది. ఇక వారితో మాట్లాడటమంటే.. అది చిరకాల కోరికగా చెప్పేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని అభిమానులకు, స్టార్లకు మధ్య గ్యాప్ తగ్గిపోయింది, దూరం చెరిగిపోయింది. తమ రోల్ మోడల్స్‌తో ఇప్పుడు ఫ్యాన్స్ ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నారు. రెగ్యులర్‌గా చిట్‌టాచ్ చేస్తున్నారు. అంతేకాదు, తమ అభిమాన తారల బర్త్‌డే‌కు బహుమతులివ్వాలని తహతహలాడుతూ.. కొందరు అందంగా బొమ్మగీస్తే, ఇంకొందరు నిలువెత్తు విగ్రహం చేస్తుంటారు, మరికొందరైతే పెన్సిల్ మొనపై కటౌట్ చెక్కేస్తుంటారు. ఇలా తమ సొంత క్రియేటివిటీతో తయారు చేసిన వాటిని తమ ఆరాధ్య నటీనటులకు ఇవ్వాలని ఆశపడుతుంటారు. అలా తన ఇష్టమైన నటుడి కోసం ఓ అభిమాని తయారు చేసిన సిగార్.. ఆ నటుడికి చేరింది.

రేడాన్‌లాబ్ అనే ఓ రెడిటర్ (రెడిట్‌లో సభ్యుడు) ఓ స్మోకింగ్ పైప్‌ను తయారు చేశాడు. ఆ సిగార్‌పై తన ఆరాధ్య నటుడు ‘ఆర్నాల్డ్’ (టెర్మినేటర్ చిత్రంలోనిది) రూపాన్ని అద్భుతంగా చెక్కాడు. దాన్ని ఆర్నాల్డ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌‌లో పోస్ట్ చేశాడు. రేడాన్ ఫెంటాస్టిక్ క్రియేషన్ కాస్తా ఆర్నాల్డ్ వరకు రీచ్ అయ్యింది. ఆ ‘టెర్మినేటర్ సిగార్ పైప్’ను చూసి.. ఆయన ఫిదా కావడమే కాదు, రేడాన్‌కు రిప్లయ్ కూడా ఇచ్చాడు. ‘వావ్.. అద్భుతంగా ఉంది, ఎంతో అందంగా కూడా ఉంది. అది నాకు అమ్ముతావా’ అంటూ మెసేజ్ పెట్టాడు. ఇక అంతే.. తన రోల్ మోడల్ రిప్లయ్ చూసిన రేడాన్‌.. పట్టలేని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆర్నాల్డ్ ప్రశ్నకు సమాధానంగా ‘నేను మీకు ఈ పైప్ అందిస్తాను, అది నాకు ఎంతో గర్వకారణం. కానీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి?’ అని అడిగాడు. అందుకు ఆర్నాల్డ్.. ‘మీరు నాకు పైప్ పంపిస్తే.. నేను ఆ పైప్‌‌తో ఫొటో దిగి, దానిపై నా సైన్ పెట్టి మీకు పంపిస్తాను. ఈ డీల్ మీకు ఓకే అయితే, నాకు ఈ మెయిల్ చేయండి. నా డీటెయిల్స్ మీకు పంపిస్తాను’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

ఇక ఆర్నాల్డ్ అన్నట్లుగానే, తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటూ.. ఆ సిగార్‌తో స్టైల్‌గా ఫొటోకు పోజిచ్చి, దానిపై తన సంతకం పెట్టి మరీ రేడాన్‌కు సెండ్ చేశాడు. ‘టూ రేడాన్.. థ్యాంక్యూ ఫర్ ద గ్రేట్ పైప్’ అంటూ తన సంతకాన్ని జత చేశాడు. అంతేకాదు, ‘ష్.. ఇది ఎవరికీ ఇవ్వొద్దు. నిజంగా ఇది ఫెంటాస్టిక్ బర్త్‌డే గిప్ట్. చాలా సంతోషం రేడాన్.. నా అటెన్షన్ పొందేందుకు నువ్వు అర్హుడివి’ అంటూ మరో మెసేజ్ కూడా సెండ్ చేశాడు.

ఆర్నాల్డ్ ఒక్కడే కాదు, రెడిటర్స్ అందరూ కూడా రేడాన్ టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. రియల్లీ.. టెర్మినేటర్ పైప్ చాలా అద్భుతంగా ఉంది. రేడాన్ సృజనాత్మకతకు హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed