అప్పుడు అత్యాచారం.. ఇప్పుడు డబుల్ మర్డర్

by  |

దిశ, వెబ్ డెస్క్: దేశంలో జరిగే క్రైమ్‌లలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటాయి. బాలికలపై అత్యాచారాలు, మర్డర్లు, దళితులపై దాడులు అనేకం అక్కడ సాధారణంగా జరుగుతాయి. కాగా తాజాగా బుధవారం యూపీలో కాస్‌గంజ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుళ్లు మార్కెట్ నుంచి వస్తుండగా వెనక నుంచి ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అందరూ దానిని మొదట అది రోడ్డు ప్రమాదం అని అనుకున్నారు. కానీ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో షాకింగ్ విషయం బయపడింది. అది రోడ్డు ప్రమాదం కాదని.. హత్య అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లీకూతుళ్లను చంపిన వ్యక్తులు తమకు తెలుసని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం తన కూతురిపై రేప్ చేశాడని.. వారిపై కేసుపెట్టినందుకు కక్షగట్టారని వివరించారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

అసలేం జరిగిదంటే.. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో శాంతిదేశి(50), బాదన్ సింగ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కూతురు సుష్మ(17) ఉంది. వీరి పొరుగింట్లో యశ్‌వీర్ అనే యువకుడు నివసిస్తున్నాడు. బాదన్ సింగ్ ఫ్యామిలీలో కలివిడిగా ఉండేవాడు. ఐతే నాలుగేళ్ల క్రితం యశ్‌వీర్ బాదన్ సింగ్ కూతురు సుష్మను రేప్ చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిడ్నాప్ చేసి అత్యారానికి పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. అయితే 2017లో బెయిల్‌పై బయటకు వచ్చిన యశ్‌వీర్‌.. అప్పటినుంచి బాదన్ ఫ్యామిలీపై రగిలిపోయేవాడు. తాను జైలుకు వెళ్లడానికి వారే కారణమని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మార్కెట్‌ నుంచి సైకిలుపై ఇంటికొస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్‌ ఎక్కించాడు. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లిద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు.



Next Story