మాజీ ప్రియురాలిని అలా చేసి.. అబ్బో మంచి కథే నడిపాడుగా!

by  |
మాజీ ప్రియురాలిని అలా చేసి.. అబ్బో మంచి కథే నడిపాడుగా!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రైవసీ అనే మాటకు విలువ లేకుండా పోతుంది. పర్సనల్ డేటా ఎంత గుట్టుగా దాచాలని ప్రయత్నించినా అవి హ్యాకర్స్ చేతికి చిక్కుతునే ఉన్నాయి. ఇక సోషల్ మీడియా సైట్ల గురుంచి, వాటి హ్యాకింగ్స్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొద్దిగా టెక్నాలజీ తెలిసినా హ్యాకింగ్ మొదలుపెట్టి , డబ్బు కోసం మహిళలను వేధించడం మొదలుపెట్టేస్తున్నారు. తాజాగా లోన్ డబ్బులు కట్టడం కోసం మాజీ ప్రేయసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసాడో ఓ ప్రబుద్దుడు. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది.

పాత ఢిల్లీలో శుభం శర్మ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి అన్నిచోట్లా అప్పులే.. అయితే గత కొంతకాలంగా లోన్ డబ్బులు కట్టాలంటూ బ్యాంకు వారు ఫోన్ చేస్తుండడంతో అందర్నీ అప్పు అడిగి విసిగిపోయాడు. దీంతో అతనికి తెలిసిన టెక్నాలజీ ని ఉపయోగించి మాజీ ప్రేయసి సోషల్ మీడియా యాప్స్ ని హ్యాక్ చేసి ఆమె వ్యక్తిగత ఫోటోలను దొంగింలించాడు. ఆ తర్వాత కొత్త సిమ్ కార్డు తీసుకొని వేరే పేరుతో ఆమెకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తొలుత భయపడిన మహిళ రూ.15 వేలు అతని అకౌంట్ లో వేసింది.

ఆ డబ్బులు సరిపోవని మరోసారి అతడు పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో సదరు మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు శుభం శర్మ ఐపీ అడ్రెస్స్ ద్వారా ఫోన్ నెంబర్ కనుక్కొని అతనిని పట్టుకున్నారు. మాజీ ప్రేమికుడే ఇదంతా చేసాడని తెలుసుకున్న ఆ మహిళ అతడికి కఠిన శిక్ష విధించాలని పోలీసులను కోరింది.


Next Story

Most Viewed