గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాడు.. వధువునే మార్చేశాడు..

by  |
గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాడు.. వధువునే మార్చేశాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి తరానికి గూగుల్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రస్తుతం గూగుల్‌ను బేస్ చేసుకుని చాలా పనులు జరుగుతున్నాయి. గూగుల్ మ్యాప్ ద్వారా రూట్ చెకింగ్, ఫుడ్ డెలివరీ వంటివి ఎంతో కీలకంగా మారాయి. కానీ ఇదే గూగుల్ వల్ల ఓ వరుడికి షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో సెంట్రల్‌ జావాలోని లొసారి హామ్లెట్‌లో వధువు ఇంటికి బయలుదేరిన వరుడు, అతని బంధువులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.

మ్యాప్స్‌ను బేస్ చేసుకుని వెళ్లగా.. సమీపంలోనే ఉన్న జెంగ్‌కోల్‌ హామ్లెట్‌ అనే మరో గ్రామానికి గూగుల్ తీసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ కూడా ఓ కళ్యాణ మండపం, పెళ్లి హడావుడి వాతావరణం ఉంది. దీంతో వరుడు, కుటుంబ సభ్యులు నేరుగా వారి ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ మారియా అనే అమ్మాయికి బుర్హాన్‌తో అనే యువకుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వారంతా బుర్హాన్‌ బంధువుల కోసం ఎదురు చూస్తుండగా.. ఈ వరుడి కుటుంబం అక్కడకు చేరుకుంది.

వచ్చింది బుర్హాన్ కుటుంబమే అనుకున్న వధువు తరఫు వారు ఏకంగా పెళ్లిదుస్తుల్లో వచ్చిన వరుడుని చూసి కంగుతిన్నారు. షాక్ నుండి తేరుకున్న వధువు బంధువులు.. వచ్చినవారు నిశ్చితార్థం కోసం వచ్చిన వారు కాదని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. దీంతో అక్కడినుంచి వరుడి కుటుంబం బయలుదేరి అసలు పెళ్లిమండపానికి వెళ్లారు.


Next Story