మలయప్ప మురళీకృష్ణుడైన వేళ..

by  |
మలయప్ప మురళీకృష్ణుడైన వేళ..
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది‌వారం రాత్రి తిరుమల ఆలయంలోని కల్యాణ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామి ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణి సత్యభామ స‌మేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ముత్యాల నిర్మల కాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు.

ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుంచి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం స్వామి సింహ వాహ‌నాన్ని అధిరోహించారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఈవో కేఎస్జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, చీఫ్ఇంజనీరు రమేష్రెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed