ఘనంగా మహేశ్ బ్యాంకు 43వ వ్యవస్థాపక దినోత్సవం

by  |
ఘనంగా మహేశ్ బ్యాంకు 43వ వ్యవస్థాపక దినోత్సవం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ పురుషోత్తం దాస్ మందాన అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మహేశ్ బ్యాంక్ రూ. 4,300 కోట్ల టర్నోవర్ కలిగి ఉందన్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు యాజమాన్య నిధులు రూ 336.88 కోట్లుగా నమోదు అయిందన్నారు.

జీరో శాతం నెట్ ఎన్పీఏతో, పన్ను ముందు లాభం రూ 58.70 కోట్లు గడించినట్లు వెల్లడించారు. సమాచార సాంకేతికతను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, వాణిజ్య, ప్రైవేట్ రంగ బ్యాంకులతో సమానంగా టెక్నో ఆధారిత ఉత్పత్తులను ప్రవేశ పెట్టినట్లు ఆయన చెప్పారు. బ్యాంక్ సీఈఓ ఉమేష్ చంద్ ఆసావా మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి పరిస్థితులలో కూడా మహేష్ బ్యాంకు
వినియోగదారులకు నిరంతరాయంగా సేవలందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రమాకాంత్ ఇనాని, బ్యాంక్ ఎమెరిటస్ చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, రాంపాల్ అట్టల్, బోర్డు డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు , సీనియర్ మేనేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed