వారికి కరోనా నెగెటివ్ టెస్ట్ తప్పనిసరి

by  |
వారికి కరోనా నెగెటివ్ టెస్ట్ తప్పనిసరి
X

ముంబయి: కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడానికి మహారాష్ట్ర సర్కారు సోమవారం నూతన మార్గదర్శకాలను వెలువరించింది. నాలుగు రాష్ట్రాలు గోవా, రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీల నుంచి వచ్చే ప్రయాణికులు మహారాష్ట్రలో అడుగుపెట్టాలంటే ఆర్టీ పీసీఆర్ ద్వారా పొందిన కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్ట్ తప్పనిసరి అని మహారాష్ట్ర ఆదేశించింది. విమానం, రైలు ప్రయాణికులు సహా రోడ్డు మార్గంలో వచ్చేవారూ తప్పనిసరిగా ఈ రిపోర్ట్ సమర్పించాలని తెలిపింది. విమాన ప్రయాణికులు షెడ్యూల్డ్ టైమ్ కంటే 72 గంటల ముందు కరోనా టెస్టు నమూనాలు ఇచ్చి ఉండాలని, ఈ రిపోర్టు చూసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను అభ్యర్థించినట్టు వివరించింది. ట్రైన్ ప్రయాణికులైతే ఈ సమయాన్ని 96 గంటలుగా నిర్ణయించింది. కరోనా టెస్టు చేయించుకున్న వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సరిహద్దు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Next Story

Most Viewed