కేంద్రంపై ఒత్తడి పెంచేందుకే మహాధర్నా : మంత్రి హరీశ్ రావు

by  |
Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు, ప్రజల పక్షపాతి టీఆర్ఎస్ అని, రైతుల ప్రక్షాన కేంద్రంపై ఒత్తడి పెంచేందుకే రేపు మహా ధర్నా నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ నెల 18న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించే మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ శాంతి యుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, రాష్టానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని కేంద్రాన్ని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం మొండివైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఆహార ధాన్యాల బాధ్యత కేంద్రానిదే అని ఆనాడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. గతంలోని యూపీఏ, ఎన్డీఏ, జనతా ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లు చేశాయని.. బీజేపీ మాత్రం విరుద్ధంగా, మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, హన్మంత్ షిండే, మాగంటి హన్మంతరావు, కౌషిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Thalasani

Next Story

Most Viewed