టీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత

by  |
టీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ నేత మాధవి రెడ్డి శనివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలవబోతున్నారని ఆయన తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేవని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రే చెప్పారన్నారు. ఇంతటి భయంకర పరిస్థితులున్నా ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయస్థానాలు పట్టించుకోవడం దురదృష్టకరమన్నారు.

సాగర్ లెక్కింపు కంటే ముందే రాజకీయ దురుద్దేశంతో సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయించారన్నారు. రాజకీయాల కోసం ఇంతకు దిగజారిన టీఆర్ఎస్ పార్టీకి అధికారులు కూడా వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో 9 స్థానాలు కాంగ్రెస్ అలయెన్స్ లో గెలిచిందని, ప్రస్తుతం 6 నియోజకవర్గాలకు ఇంచార్జులే లేరన్నారు. ఎన్ని అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం మున్సిపాలిటీలో పాలేరు సగానికిపైగా ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాదిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు.

Next Story

Most Viewed