బాడీ‌షేమింగ్ క్యారెక్టర్‌ డిసైడరా..?:మాన్వి

by  |
బాడీ‌షేమింగ్ క్యారెక్టర్‌ డిసైడరా..?:మాన్వి
X

దిశ, వెబ్ డెస్క్: మాన్వీ గగ్రూ ‘ఫోర్ మోర్ షాట్స్’ సిరీస్ చూసిన వారికి సుపరిచితమే. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సిరీస్..ఫెమినిజం గురించి ప్రస్తావించింది. అందులో తప్పులు వెతికిన వారు కొందరు అయితే, స్త్రీవాదాన్ని గుర్తించిన వారు కొందరు ఉన్నారు. కంటెంట్ బోల్డ్‌గా ఉందని, సెక్స్ గురించి ఎక్కువగా చర్చ జరిగిందని విమర్శలు వచ్చాయి. దీనిపై మాన్వీ గగ్రూ స్పందించింది. కేవలం సెక్స్‌కు సంబంధించిన సీన్స్ ఫార్వాడ్ చేస్తూ, రిపీట్ చేస్తూ చూస్తుంటే కేవలం అదే కనబడుతుంది తప్ప..అసలైన కంటెంట్ కనిపించదు. చెవికి వినిపించదని ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది. ఇలాంటి వాళ్లకు అమ్మాయిలు ఇలాంటి, అలాంటి దుస్తులు వేసుకున్నారని కామెంట్స్ చేయడానికే ముందుంటారు తప్పితే.. అది ఫ్యాషన్ అన్న విషయం గుర్తించలేరు అంది.

ఈ సమయంలో తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడిన వాళ్లను కూడా కడిగి పారేసింది మాన్వీ గగ్రూ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొందరు తన బాడీ గురించే మాట్లాడే వారని..లావుగా ఉన్నావు లీడ్ యాక్టర్‌గా పనికి రావని కామెంట్ చేశారని చెప్పింది. ఫ్యాట్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేసేందుకు అంతగా ఫ్యాట్‌గా కూడా లేవని..నీకసలు ఇండస్ట్రీలో ఉండే అర్హత లేదన్నట్లు మాట్లాడారని చెప్పింది. అయినా లావు అవ్వు లేదా సన్నగా అయ్యేందుకు ట్రై చెయ్ అని చెప్పే హక్కు ఎవరికీ లేదంది. నేనేమీ నాకోసం ఓ క్యారెక్టర్ రాయమని అడగలేదు కదా..అలాంటప్పుడు ఈ వెధవ డిస్కషన్స్ ఏంటి అనిపిస్తుందని బోల్డ్‌గా చెప్పేసింది.

క్యారెక్టర్ డెఫినేషన్ లేదా డిస్క్రిప్షన్ అనేది ఫిజికల్ ఫిట్ నెస్ మీద బేస్ అయి ఉండదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలంది. లావుగా ఉన్నా లేదా సన్నగా ఉన్నా అనే విషయం నాకే ఇష్యూ కానప్పుడు పక్కనోడికి ఎలా ఇష్యూ అవుతుందో అర్థం కావడం లేదంటుంది మాన్వీ.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed