జూన్‌లో టేకాఫ్‌‌కు ‘లుఫ్తాన్సా’ రెడీ!

by  |
జూన్‌లో టేకాఫ్‌‌కు ‘లుఫ్తాన్సా’ రెడీ!
X

దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుండటంతో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.అడపాదడపా విమానాలు నడిచినా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వివిధ దేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా విమానయాన సంస్థలు రుణం భారాన్ని మోస్తుండటంతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి.ఇప్పుడు కూడా విమానాలు నడిపించకపోతే ఉద్యోగుల పెండింగ్ జీతాలు, అప్పులు భారంతో పాటు, టెక్నికల్ గా ఇబ్బందులు తలెత్తె అవకాశం లేకపోలేదు.ఈ నేపథ్యంలోనే ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా తన సర్వీసులను జూన్ నెలలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా మొత్తం 130 ప్రధాన నగరాలకు సర్వీసులను నడపాలని యోచిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ముంబై టు ఫ్రాంక్‌ఫర్ట్ నగరాల మధ్య విమాన సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమలవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ముఖ్యంగా ముంబై-ఫ్రాంక్‌ఫర్ట్ నగరాల మధ్య విమాన సర్వీసులకు డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా తొలుత ఆ నగరాల మధ్య సర్వీసులు ప్రారంభించనున్నట్టు లుఫ్తాన్సా గ్రూప్ సౌత్ ఏషియా సీనియర్ డైరెక్టర్ జార్జ్ ప్రకటించారు. జూన్ చివరి నాటికి మొత్తం 130 గమ్యస్థానాలకు 1800 వీక్లీ రౌండ్‌ ట్రిప్‌ సర్వీసులను అందించాలని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.ముంబై సహా జర్మనీ, యూరప్ దేశాలతో పాటు మొత్తం 20 అంతర్జాతీయ నగరాలకు తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు జార్జ్ వివరించారు.


Next Story