తగ్గిన గ్యాస్ ధరలు!

by  |
తగ్గిన గ్యాస్ ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారులకు ఉపశమనం కలిగించే విధంగా, సబ్సీడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ. 65 వరకూ తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీ) బుధవారం వెల్లడించింది. గత రెండు నెలల్లో ఎల్‌పీజీ ధరలను వరుసగా రెండోసారి తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోతుండటాన్ని పరిగణలోకి తీసుకుని ఎల్‌పీజీ ధరలు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఎల్‌పీజీ ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో గమనిస్తే..

14 కిలోలు ఎల్‌పీజీ సిలిండర్ ధర:

ఢిల్లీ : రూ. 744 ( సవరణకు ముందు రూ. 805.5)
కోల్‌కతా : రూ. 774.5 (సవరణకు ముందు రూ. 839.5)
ముంబై : రూ. 714.5 ( సవరణకు ముందు రూ. 776.5)
చెన్నై : రూ. 761.5 ( సవరణకు ముందు రూ. 826)

19 కిలోల సిలిండర్‌ ధరలు :
ఢిల్లి : రూ. 1,285.5
కోల్‌కతా: రూ. 1,348.5
ముంబై: రూ. 1,234.5
చెన్నై: రూ. 1,402

మార్చిలో, ప్రభుత్వం సబ్సిడీ లేని దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను (14.2 కిలోలు) సగటున రూ .53 కు తగ్గించింది. ఫిబ్రవరిలో, సబ్సిడీ లేని సిలిండర్ల ఎల్‌పీజీ సిలిండర్ ధరల0ను సుమారు రూ .150 పెంచారు. మరోవైపు ముడి చమురు ధరలు 2002 ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 25.88 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక మందగమనం చెలరేగడంతో చమురుకు డిమాండ్ తగ్గింది. అయితే, కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచడంతో దేశీయంగా వినియోగదారులు పెట్రోల్, డీజిల్ తగ్గింపునకు నోచుకోలేకపోతున్నారు.

Tags : Lpg Cylinder Price Today, Lpg Price In Mumbai, Indane, Indian Oil Corporation, IOC

Next Story

Most Viewed