లవ్‌ జిహాద్ కేసు.. యువతికి మత్తు పదార్థాలిచ్చి..!

by  |
love jihad
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకుంటానని వెంట పడ్డాడు. నిజమే అని నమ్మి పెళ్లి చేసుకున్న యువతిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. సరిగ్గా మూడేళ్ల కిందట వీరికి వివాహం జరగగా.. నాటి నుంచి మతం మార్చుకోవాలని టార్చర్ చేసేవాడు. బలవంతంగా మతం మార్చించడమే కాకుండా మత్తు పదార్థాలు ఇచ్చి నరకం చూపించేవాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో బుధవారం విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దివ్య అనే అమ్మాయిని తాసిఫ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నిజం అని నమ్మిన యువతి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతన్ని ప్రేమవివాహం చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా కొద్దిరోజుల తర్వాత తాసిఫ్ నిజస్వరూపం బయటపడింది. మతం మార్పించడమే కాకుండా రోజూ టార్చర్ చేసేవాడు. చివరకు బలవంతంగా మతం మార్పించాడు. అంతటితో ఆగకుండా మత్తు పదార్థాలు ఇచ్చి యువతిని తీవ్రంగా హింసించేవాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తాసిఫ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు లవ్ జిహాద్ పేరిట యువతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది.

గుంటూరులో వెలుగుచూసిన లవ్ జిహాద్ అంశంపై సినీనటీ కరాటే కళ్యాణి స్పందించారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. ప్రభుత్వం లవ్‌జిహాద్ పై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

ఏయే రాష్ట్రాల్లో లవ్‌జిహాద్‌కు వ్యతిరేకంగా చర్యలు..

ప్రేమపేరుతో హిందూ యువతులను వంచించి మత మార్పిడులకు యత్నించడం వంటి కేసులు దేశంలో ఇటీవల చాలా వెలుగుచూస్తున్నాయి. దీనినే లవ్‌‌ జిహాద్‌గా హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ అభివర్ణిస్తోంది. ఇందు కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇప్పటికే యూపీలో లవ్ జిహాద్ ఆర్డినెన్స్ -2020ను యోగి ప్రభుత్వం తీసుకుని రాగా, తొలి కేసు కూడా నమోదైంది. యూపీ బాటలోనే మధ్యప్రదేశ్‌తో పాటు కర్ణాటక ప్రభుత్వాలు కూడా లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed