ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్..

106

దిశ, ఏపీ బ్యూరో: జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని.. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆడబిడ్డల్ని బయటకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని ట్విటర్ వేదికగా విమర్శించారు. ‘విశాఖజిల్లా అచ్యుతాపురం మండలం కడపాలెంలో తండ్రీ, కొడుకులు మృగాళ్లా మారి బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.

బాధితులే నిందితుల్ని గుర్తించాలనే మహిళా హోంమంత్రి అసమర్ధ వ్యాఖ్యలు, కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్ష పడకపోవడం వల్లే కామోన్మాదులు రెచ్చిపోతున్నారు. మీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కోసం పోలీసుల్ని వాడుకోవడం మానేస్తే, కనీసం వారు నిందితులనైనా పట్టుకుంటారు’ అంటూ నారా లోకేశ్ ట్విటర్ వేదికగా హితవు పలికారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..