సకాలంలో వైద్యం అందిస్తాం: హోం మినిస్టర్

by  |
సకాలంలో వైద్యం అందిస్తాం: హోం మినిస్టర్
X

దిశ, చార్మినార్: పురానాపూల్ జలాల్ కుంచలో బస్తీ దవాఖానాను శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, చార్మినార్ ఎమ్మెల్యే మొహమ్మద్ ముంతాజ్ అహ్మద్ ఖాన్, జోనల్ కమిషనర్ నామా సామ్రాట్ అశోక్ లతో కలిసి ప్రారంభించారు. మలక్​పేట్ సర్కిల్ పరిధిలోని చావుని బాగ్ ఏ జహార లోని బస్తీ దవాఖానాను మలక్​పేట్​ ఎమ్మెల్యే అహ్మద్ బలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్​ అలీ మాట్లాడుతూ.. ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు.

ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసి పరిధిలో 226 బస్తీ దవాఖానాలు ఉన్నాయని, నూతనంగా 32 ఏర్పాటు చేశామన్నారు. బస్తీల్లోని ప్రజలందరూ స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానాలో ఉచిత వైద్య సేవలు పొందాలని సూచించారు.

Next Story

Most Viewed