కవిమాట: ఒక ద్వారం తెరుచుకుని..

by Disha edit |
కవిమాట: ఒక ద్వారం తెరుచుకుని..
X

ఓడిపోవటం మరణించడం కాదు

చతికిలబడటం అసలే కాదు

మరోమారు ఇంకా శ్రద్ధగా

ఏకాగ్రతగా మొలకెత్తడం

గెలవటమేమో సంయమనంగా

సమతుల్యంతో పరిమళించడం!

ఒకే రంగులుండవు ప్రకృతిలో

వైవిధ్యాల అమరికలు అనన్యం

గెలుపు ఓటముల సుడిగుండాల్లో

ఏదైనా ఒక దారం పట్టుకుని వెళ్ళగలిగితే-

ఎన్నో ప్రపంచాలు తెర తీసుకుంటాయ్!

వేసే అడుగులు

దార్శనికపుటద్దాలు తొడగకపోతే

అల్లకల్లోలపు రొంపిలో పడి

పశ్చాత్తాపపు కాలువలో కొట్టుకుపోతాం

పొరపాట్ల ఆటుపోట్లు ముంచెత్తకముందే

మనిషి బుద్ధితో మనసుతో వినగలిగిన్నాడు

సరళత్వాన్ని పుణికిపుచ్చుకుంటాడు

గొప్ప వ్యవస్థను నిర్మిస్తాడు!

- రఘు వగ్గు

79782 45215


Next Story